Saturday, November 23, 2024

వివాదంలో ప‌ఠాన్.. UA సర్టిఫికేట్

ప‌లు వివాదాల్లో చిక్కుకుంది ప‌ఠాన్ మూవీ. యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహాం విలన్ గా నటిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచించిన కట్ (తొలగింపు) లకు సంబంధించిన అప్ డేట్ తాజాగా వచ్చింది. CBFC సూచనల మేరకు పఠాన్ లో పది ప్రధాన కట్ లు జరిగాయి. అదనంగా మరో మూడు పాక్షిక కట్ లను చేశారని సమాచారం. ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ దక్కింది.

ఈ చిత్రంలో స్టార్ న‌టులు షారూఖ్ ఖాన్ – దీపికా పదుకొనే జంట‌గా న‌టించారు. ఇందులో కథానాయిక దీపికా పదుకొనే క్లోజప్ షాట్ లను తొలగించడంతో పాటు డైలాగ్ లలో కొన్ని మార్పులు చేశారు. బేషరమ్ రంగ్ అనే వివాదాస్పద పాటకు కనీసం మూడు మార్పులు చేయాలని సీబీఎఫ్ సి కోరింది. సైడ్-పోజ్ లు మతిచెడే ఊప్స్ డ్యాన్స్ మూమెంట్ ల క్లోజప్ షాట్ లను తొలగించాలని సూచించారు. CBFC సూచించిన కత్తిరింపుల వివరాలను మరింత లోతుగా పరిశీలిస్తే.. ఇప్పటికే చెలరేగిన వివాదాలు.. నిరసనలకు చెక్ పెట్టేందుకు కుంకుమపువ్వు లేదా కాషాయ రంగు వస్త్రాన్ని తొలగించారా లేదా మార్చారా అనే విషయాన్ని సర్టిఫికెట్ లో పేర్కొనలేదు. ఎట్టకేలకు సెన్సార్ బోర్డు 13 కట్స్ వరకు ఆదేశించిన అనంతరం ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement