Monday, November 25, 2024

ప‌ఠాన్.. షారుక్ ఖాన్ కి హిట్టా..ఫ‌ట్టా

నాలుగేళ్ల త‌ర్వాత ప‌ఠాన్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్. బేషరమ్ రంగ్’ సాంగ్‌తో రేగిన చిచ్చు కారణంగా అందరి దృష్టి ‘పఠాన్’పై పడింది. మ‌రి ఈ చిత్రం హిట్టా ఫ‌ట్టా..ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..

క‌థ‌.. జిమ్ (జాన్ అబ్రహం)కు భారత దేశం అంటే న‌చ్చదు. ఇండియా పరువుని, ప్రతిష్టను మంట గలిపేయాలని, అవసరమైతే దేశాన్ని నాశనం చేసేయాలని అతను ఆలోచన. లక్ష్యం..నిజానికి అతను ఇక్కడ RAW లో పనిచేసి వాడే…అయితే అతనికి ప్రొఫెషనల్ గా జరిగిన కొన్ని సంఘటనలతో కుటుంబాన్ని కోల్పోయి ,విరక్తి భావం పెంచుకుంటాడు. అలాంటి జిమ్ కు ఓ ఆఫర్ వస్తుంది. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 (జమ్ము కాశ్మీర్ స్పెషల్ స్టేటస్) రద్దు చేయడంతో ఆగ్రహంతో రగిలిపోయిన పాకిస్తాన్ కల్నల్ ఒకరు ఓ మిషన్ అప్పగిస్తాడు. అతనికి తోడుగా రుబై(దీపిక పదుకొణె) అనే ex ISI ఏజెంట్ తోడుగా ఉంటుంది. తన మిషన్ లో భాగంగా జిమ్… మన దేశంపై రక్తబీజ్ అనే బయో వార్ చేసేందుకు ప్లాన్ చేస్తాడు. వైరస్ తో దేశ జనాలని చంపాలనుకుంటాడు. అప్పుడే ఆ వార్ ని అడ్డుకునేందుకు సమర్దుడైన ఏజెంట్ పఠాన్ (షారుఖ్ ఖాన్) రంగంలోకి దూకుతాడు. అనాథ అయిన పఠాన్ (షారూఖ్ ఖాన్) దేశాన్నే తన తల్లిగా భావిస్తూంటాడు. తన జీవితంలో ఆమె రుణం తీర్చుకోవడానికి ఇండియన్ ఆర్మీలో చేరతాడు. ఓ ఆపరేషన్ నిమిత్తం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలను రక్షించి, కొద్దిలో చావు తప్పించుకుని కోమాలోకి వెళ్తాడు. తమ ప్రాణాలను కాపాడిన అతన్ని అక్కడి వారు సొంత బిడ్డగా ఆదరించి, ‘పఠాన్’ అని పిలుచుకుంటారు. అప్పటి నుండీ అదే అతని అసలు పేరుగా మారుతుంది. అలాంటి.జోకర్ (JOCR) అనే టీమ్ ను పఠాన్ ఎందుకు ఏర్పాటు చేస్తాడు..రక్త భీజ్ తో జరిగే అనర్దాలు ఏమిటి.. పఠాన్ ఆ బయోవార్ ని ఆపగలిగాడా…వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

- Advertisement -

విశ్లేషణ.. పఠాన్ కథగా చెప్పాలంటే ఎన్నో సార్లు చూసిందే. బాగా తెలిసిందే. అయితే దాన్ని ఎంగేజింగ్ గా చెప్పాలనే ప్రయత్నం చేసాడు డైరక్టర్. ఫస్టాఫ్ ట్విస్ట్ లతో నడిచిపోయింది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఎపిసోడ్ మధ్యలో ఆపి ఇచ్చారు. అది ఊహించగలిగిన ట్విస్ట్ అయినా బాగానే ఉందనిపిస్తుంది. అయితే సెకండాప్ లో వచ్చే మిగతా ట్విస్టులలో కిక్ లేదు. అయితే డైరక్టర్ పూర్తిగా షారూఖ్ ఖాన్ లోని యాక్షన్ ని బయిటకు తీసుకువచ్చారు. దాంతో సినిమా నిండా యాక్షన్ ఎపిసోడ్స్… ఒకరినొకరు కాల్చుకోవడాలు, పేల్చుకోవడాలుతో నిండిపోయింది. మధ్య మధ్యలో దేశభక్తి డైలాగులు మనని పలకరిస్తూంటాయి. దేశభక్తి సినిమాలు బాలీవుడ్ లో తగ్గాయి అనుకున్న టైమ్ లో ఈ సినిమా వచ్చి మళ్ళీ ఆ సినిమాలను గుర్తు చేసింది. అలాగే సినిమా చూస్తున్నంత సేపూ ఇదే దర్శకుడు వార్ సినిమా గుర్తు వస్తుంది. అయితే ఆ చిత్రంలో ఎమోషన్ ఇక్కడ అంతగా లేదు. అలాగే విలన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, ఆఫ్ఘానిస్తాన్ విలేజ్ డ్రామా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. అలాగే యశ్ రాజ్ ఫిల్మ్స్‌ బ్యానర్ లో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు రిఫరెన్సులు ఇందులో కనిపిస్తాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లాగే ప్లాన్ చేసారు. అయితే అది వర్కవుట్ అయ్యింది కూడా. ఇంటర్వెల్ తర్వాత పఠాన్ కోసం టైగర్ సల్మాన్ ఖాన్ రావటం, ఫైట్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమా చివర్లో సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్ ఖాన్ కూర్చుని మాట్లాడుకునే సీన్ ని సైతం అభిమానులకు కిక్కిచ్చేలా చేశాడు డైరక్టర్.

టెక్నికల్ …ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ తప్పిస్తే మిగతాదంతా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. ప్రారంభంలో జాన్ అబ్రహం, షారుఖ్ మధ్య వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. రష్యా,ఆప్గనిస్దాన్ ఇలా వరసపెట్టి దేశాలు చూపినప్పుడు కెమెరా వర్క్ .. విజువల్ వండర్‌గా అనిపించేలా చేసారు. ఇక దీపిక ఇంట్రడక్షన్ సాంగ్ లో ఆమె అందాలు, యాక్షన్ సీక్వెన్స్‌కు ఫస్టాఫ్ కు గిట్టుబాటు అనిపిస్తాయి. సెకండాఫ్ సల్మాన్ ఖాన్ తో షారూఖ్ సీన్స్ హైలెట్ గా అనిపిస్తాయి. అలా కమర్షియల్ వైబులిటీ వచ్చేలా ప్లాన్ చేసుకున్న స్క్రిప్టు ఇది. డైరక్టర్ సిద్దార్ద్ ఆనంద్..హాలీవుడ్ సినిమాలనుంచి ప్రేరణ పొంది తీసిన సీన్స్ …పెద్ద తెరపై నిండుగా మెస్మరైజింగ్ గా అనిపిస్తాయి. డైలాగులు, పాటలు, రీరికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అవుతాయి. సినిమాటోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్‌. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు మరోసారి తమ సత్తాని చాటాయి.

నటీనటులు.. ఇక షారూఖ్ ఖాన్ న‌ట‌న‌కి వంక‌పెట్టేదేముంది.. దీపిక ప‌దుకొణే చించేసింది..గ్లామ‌ర్ తో చంపేసింది.మిగ‌తా న‌టీ న‌టుల న‌ట‌న బాగుంది. సాంగ్స్ లో గ్లామ‌ర్ డోస్ ఎక్కువ‌యింద‌నే చెప్పాలి. ఎవ‌రి ప‌రిధిలో వారు న‌టించారు.ఓవ‌రాల్ గా ఈ మూవీతో షారుక్ కంబ్యాక్ ఇచ్చాడ‌నే చెప్పాలి.యాక్ష‌న్ సీన్స్ హైలెట్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement