ఆత్మకూరు, (ప్రభాన్యూస్) : మండల పరిధిలోని నల్లమల అభయ్యారణ్యంలో మానవత్వం మంట కలిసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి సాయం కోసం అర్థ నాదాలు చేసిన బాధితుల పట్ల ప్రయాణికులు జాలి చూపలేదు. ఆదివారం శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూర్ అటవీ డివిజన్ నల్లమల రోళ్లపెంట ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకోంది. ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.. నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన జంబూలయ్య అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె వైద్యం కోసం ప్రకాశం జిల్లా మార్కాపురం లోని ఓ ప్రయివేటు హస్పెటల్ కు బైక్ పై కుటుంబ సామెతంగా వెళ్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొనడం తో అక్కడికక్కడే భార్య మహిమ (30), చిన్నారి స్వాతిక (04) మృతి చెందారు. ఈ ప్రమాదంలో జాబులయ్య, మరో చిన్నారి సరిత గాయల పాలైయ్యారు.
ప్రమాద సంఘటనలో బాధితుడు జంబూలయ్య తమ వారిని రక్షించుకునేందుకు వాహనాలపై వెళ్లే వాహన దారులను రెండు గంటల పాటు ప్రాదేయపడిన ఘటన హృదయాన్ని కలిచి వేసింది. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని నుంచి ప్రయాణంలో ఎమ్మిగనూరుకు వెళ్తున్న శ్రీనివాస నాయుడు అనే వ్యక్తి మానవత్వం చాటుకొని తన వాహనం లో క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ వైద్య శాలకు తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే తల్లి, చిన్నారి స్వాతిక మృతి చెందినట్లు ధ్రువీకరించారు. భార్యను కోల్పోయిన జంబూలయ్య, తల్లిని చెల్లిని కోల్పోయిన సరిత రోధనాలు అందరిని కలిచివేశాయి.