Saturday, November 23, 2024

ప్యాసింజర్‌ సేల్స్‌ డౌన్‌.. 3.84 శాతం క్షీణించిన అమ్మకాలు

న్యూఢిల్లి : ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు భారీగా క్షీణించాయి. సెమీ కండక్టర్‌ల కొరత కారణంగా.. సప్లై చైన్‌ దెబ్బతిన్నది. రికార్డు స్థాయిలో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు పడిపోయాయి. ఏడాది ప్రాతిపదికన చూసుకుంటే.. ఏప్రిల్‌లో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు.. 3.84 శాతం పడిపోయి.. 2,51,581 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో 2,61,633 యూనిట్లు అమ్ముడుపోయాయి. మార్చి 2022లో 2,79,501 యూనిట్ల ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు జరిగాయి. నెలవారీగా పోలిస్తే.. 9.98 శాతం క్షీణతను నమోదు చేసింది. ప్యాసింజర్‌ కార్ల విక్రయాలు 20.06 శాతం తగ్గి.. 1,12,857 యూనిట్లు విక్రయించగా.. ఏడాది క్రితం ఇదే నెలలో 1,41,194 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక వ్యాన్ల విషయానికొస్తే కూడా.. దాదాపు సమాన యూనిట్ల అమ్మకాలు కొనసాగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్యాసింజర్‌ వ్యాన్‌ల కేటగిరీలో 11,511 యూనిట్లు అమ్ముడుపోగా.. గతేడాది ఏప్రిల్‌ కాలంలో.. 11,568 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అదేవిధంగా యుటిలిటీ వెహికిల్‌ (ప్రైమర్లీ ఎస్‌యూవీ) సెగ్మెంట్‌లో మాత్రం అమ్మకాలు వెల్లువెత్తాయి. 2022 ఏప్రిల్‌లో 1,27,213 యూనిట్ల ఎస్‌యూవీలు అమ్ముడుపోగా.. 2021 ఏప్రిల్‌లో 1,08,871 యూనిట్ల ఎస్‌యూవీలు అమ్ముడపోయాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే.. ఈ ఏప్రిల్‌లో 16.84 శాతం ఎస్‌వీయూల అమ్మకాలు పెరిగాయి.

2017 తరువాత తొలిసారి..

ఎస్‌ఐఏఎం డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ మాట్లాడుతూ.. ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు చూసుకుంటే.. ఏప్రిల్‌ 2017 తరువాత.. తొలిసారి భారీగా అమ్మకాలు క్షీణించాయి. టూ వీలర్‌ అమ్మకాల్లో మాత్రం ఏప్రిల్‌ 2012 గణాంకాల కంటే దిగువన ఉన్నాయి. ఏప్రిల్‌ 2016 గణాంకాల్లో ఇప్పటికే 50 శాతం కంటే తక్కువ అమ్మకాలు ఉన్నందున.. త్రీ వీలర్‌లు.. ఇంకా సాధారణ స్థాయికి చేరుకోలేదు. పరిశ్రమకు ఉత్పత్తిపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. రెపో రేట్ల పెంపు కారణంగా కూడా ప్యాసింజర్‌ అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. డిమాండ్‌ తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రెపో రేటు కారణంగా రుణ రేట్లు పెరిగాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు.. కారు, హోం లోన్‌లపై వడ్డీలు పెంచాయి. దీంతో సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రజలు.. లోన్‌ ద్వారా కారు తీసుకోవాలనుకునేవారు.. వడ్డీ కారణంగా వెనుకడుగు వేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement