Thursday, November 21, 2024

రికార్డ్‌ స్థాయిలో కార్ల అమ్మకాలు

దేశంలో ఏప్రిల్‌ నెలలో రికార్డ్‌ స్థాయిలో ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు జరిగాయి. ఇప్పటి వరకు ఏప్రిల్‌ నెలలో ఈ స్థాయిలో అమ్మకాలు జరగడం ఇదే మొదటిసారని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యూఫ్యాక్చరర్స్‌ (ఎస్‌ఐఏఎం-సైమా) తెలిపింది. ఏప్రిల్‌లో నెలలో అమ్మకాలు 12.9 శాతం పెరిగి 3,31,278 యూనిట్లుగా నమోదైన్లు తెలిపింది. ఈ నెలలో ప్యాసింజర్‌ వాహనాలు, టూ, త్రీ వీలర్స్‌, క్వాడ్రి సైకిల్స్‌ ఉత్పత్తి మొత్తం 19,57,599 యూనిట్లు ఉత్పత్తి జరిగినట్లు సైమా తెలిపింది. బీఎస్‌6 ఫేజ్‌ 2 కాలుష్య ప్రమాణాలు అమల్లోకి వచ్చిన తరువాత అమ్మకాలు భారీగా పెరిగాయని తెలిపింది.

గత సంవత్సరం ఏప్రిల్‌ నెలలో జరిగిన అమ్మకాలతో పోలచితే ఈ ఏప్రిల్‌లో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 12.9 శాతం పెరిగి 3,31,278 యూనిట్లుగా ఉన్నాయని తెలిపింది. టూ వీలర్స్‌ అమ్మకాల్లో 15.1 శాతం వృద్ధితో 13,38,588 యూనిట్లగా నమోదయ్యాయని సైమా తెలిపింది. త్రీ వీలర్స్‌ అమ్మకాలు కోవిడ్‌కు ముందు స్థాయికి చేరుకున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో 42,885 త్రీ వీలర్స్‌ అమ్మకాలు జరిగాయి.

- Advertisement -

ప్యాసింజర్‌ వాహనాలు, టూ, త్రీ వీలర్ల అమ్మకాలు భారీగా పెరగడం పట్ల సైమా డైరెక్టర్‌ జనరల్‌ రాజేష్‌ మీనన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సారి మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించినందున రానున్న నెలల్లోనూ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని ఆశిస్తున్నట్లు సైమా అధ్యక్షుడు వినోద్‌ అగర్వాల్‌ చెప్పారు. ఎలాంటి సమస్యలు లేకుండా బీఎస్‌ 6 ఫేజ్‌ 2 ప్రమాణాలను పరిశ్రమ అమలు చేయడం వల్ల కార్లు, టూ వీలర్స్‌, త్రీ వీలర్స్‌ అమ్మకాలు పెరగడం మంచి పరిణామని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement