విభజన హామీలు ఒక్కటీ అమలు కావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ తెలంగాణ వచ్చినప్పటి నుంచి గిరిజన సమాజం అత్యధికంగా నష్టపోతోందన్నారు. కేంద్రం గిరిజనులకు 7.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే రాష్ట్రం మాత్రం 6శాతం రిజర్వేషన్లు కల్పిస్తోందని విమర్శించారు. కృష్ణా నదీ జలాల పంపిణీ సక్రమంగా జరగడం లేదన్నారు. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నా.. రాష్టానికి రావాల్సిన హక్కులను సాధించుకోలేకపోతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ తెలంగాణ విషయంలో రాజ్యాంగ బద్దంగా మాట్లాడటం లేదన్నారు. తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని ప్రధాని ఎలా అంటారని ప్రశ్నించారు. అసలు తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీజేపీకి ఉందా? అని నిలదీశారు. బీజేపీకి విభజన అంశాల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వంతో తాము ఉంటామని స్పష్టం చేశారు. విభజన అంశాలపై అఖిల పక్షం ఏర్పాటు చేసి కేంద్రం వద్దకు తీసుకు వెళ్ళాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. భద్రాచలం పక్కన ఉన్న 7 గ్రామాలను తెలంగాణలో కలపాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement