Sunday, September 8, 2024

Parlianent – బ‌డ్జెట్ భేటీకి వ్యూహం! కాంగ్రెస్ ఎంపీల‌కు దిశా నిర్ధేశం చేయ‌నున్న‌ సోనియా

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – బడ్జెట్ సమావేశాల వ్యూహాన్ని రూపొందించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన సోమవారం కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం జరుగుతుందని ఆ పార్టీ తెలిపింది. సోనియాగాంధీ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. మరోవైపు పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం అఖిలపక్ష సమావేశం జ‌రిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఈ భేటీ నిర్వ‌హించారు.

ఈ నెల 22వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.23న బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం..కాగా, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందురోజు (సోమవారం) ఆర్థిక సర్వేను నిర్మలా ప్రవేశపెట్టనున్నారు. వివిధ రంగాల ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన గణాంక సమాచారం, విశ్లేషణలతోపాటు ఉపాధి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, బడ్జెట్‌లోటు తదితరాలను ఆర్థిక సర్వే వెల్లడించనుంది.

- Advertisement -

నీట్‌పై నిల‌దీసేందుకు ప్ర‌తిప‌క్షాలు రెడీ..

ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ నేతృత్వంలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందించింది. మరోవైపు నీట్‌ ప్రశ్నాపత్రం లీకైన కేసు, రైల్వే భద్రత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగే ఈ సమావేశాలలో 90 ఏళ్ల నాటి పౌర విమానయాన చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడం సహా ఆరు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రస్తుతం కేంద్ర పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

రాజ్య‌స‌భ‌లో హ్యాండ్‌ బుక్‌.. నిబంధనలివే..

సభాధ్యక్షుడి ఆదేశాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడా విమర్శించకూడదని ఎంపీలకు స్పష్టం చేశారు. సభలో వందేమాతరం, జైహింద్ వంటి నినాదాలేమీ చేయకూడదని తేల్చిచెప్పారు. సభలో ప్లకార్డులు తదితరాలు ప్రదర్శించడమూ పద్ధతి కాదంటూ.. పార్లమెంటరీ ఆచారాలు, సంప్రదాయాలపై సభ్యులు దృష్టిపెట్టేలా ‘రాజ్యసభ సభ్యుల కోసం హేండ్‌ బుక్‌’ను రాజ్యసభ సెక్రటేరియట్‌ తీసుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement