Saturday, November 23, 2024

అబార్షన్ సవరణ బిల్లుకు పెద్దల సభ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్​ కమిషన్​ ఫర్​ అలైడ్​ హెల్త్​కేర్​ ప్రొఫెషన్స్ బిల్లు- 2020కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆరోగ్య రంగానికి సంబంధించి పెండింగ్​లో ఉన్న డిమాండ్​లను తీర్చే విధంగా ఈ బిల్లును రూపొందించినట్లు కేంద్రం తెలిపింది. దీని ద్వారా 8-9 లక్షల మంది అనుబంధ వృత్తి నిపుణులు లబ్ధిపొందుతారని, 2030 నాటికి వైద్య రంగంలో సిబ్బందిని 1.80 కోట్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

అటు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, 1971ను సవరిస్తూ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (అమెండ్‌మెంట్) బిల్- 2020ని రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును ఏడాది క్రితమే లోక్‌సభ ఆమోదించింది. అత్యాచార బాధితులు, వావి వరుసలేని లైంగిక సంబంధాల బాధితులు, మైనర్లు, దివ్యాంగులు సహా ప్రత్యేక వర్గాలకు చెందిన మహిళలు గర్భస్రావం చేయించుకోవడానికి కాల పరిమితిని పెంచేందుకు ఈ బిల్లు ప్రతిపాదించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం గర్భం ప్రారంభమైనప్పటి నుంచి 20 వారాల వరకు గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతి ఉంది. దీనిని 24 వారాలకు పెంచాలని ఈ బిల్లు ప్రతిపాదించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement