Friday, November 22, 2024

Breaking: విధ్వంసక ఆయుధాలకు నిధుల సమీకరణ నిషేధం​.. పార్లమెంట్​లో బిల్లుకు ఆమోదం

సామూహిక విధ్వంసక ఆయుధాలకు నిధులను నిషేదిస్తూ పార్లమెంట్​లో బిల్లు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇట్లాంటి కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తుల ఆస్తులతోపాటు వారి ఆర్థిక వనరులను స్తంభింపజేయడానికి చట్టం రూపొందించారు. అంతేకాకుండా వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి లేదా అటాచ్ చేయడానికి కేంద్రానికి అధికారం కల్పించేలా దీన్ని తయారు చేశారు. ఈ బిల్లును పార్లమెంటు సోమవారం ఆమోదించింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పైలట్ చేసిన సామూహిక విధ్వంసం, వాటి పంపిణీ వ్యవస్థల (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిషేధం) సవరణ బిల్లు 2022ని ప్రతిపక్ష పార్టీల నిరసల మధ్య ఆమోదం లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement