Tuesday, November 26, 2024

ర్యాలీలో పాల్గొన్న ‘జడ్జీలు’.. రాజేష్,సరితా..

గిద్దలూరు ప్రభ న్యూస్ : ఉచిత న్యాయ సహాయం లోక్ అదాలత్ ధ్యేయం” అని గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.రాజేష్ అన్నారు. జాతీయ న్యాయసేవల దినోత్సవం సంధర్భంగా పలు పాఠశాలల విద్యార్థులతో కోర్ట్ ఆవరణ‌ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ఉచిత న్యాయ సహాయం లోక్ అదాలత్ ధ్యేయం” నినాదాలతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం కోర్ట్ ఆవరణలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి బి.రాజేష్, అదనపు జడ్జి వై.సరితా మాట్లాడుతూ ప్రపంచంలో మొట్టమొదట 1815 వ సం..లో ఫ్రాన్స్ దేశం నందు న్యాయసహయం గురించి అవగాహన కలిగిందని,1952 వ సం.. లో భారత పార్లమెంట్ వారు ఆర్టికల్ 14 వ అదీకరణం ధ్వారా న్యాయసహాయం జరుగుతుందని,1995 సం. నవంబర్ 9 వ తేదీన జాతీయ న్యాయసేవాధికారసంస్థ ఏర్పడిందని అప్పటి నుండి ఇప్పటి వరకు న్యాయ సహాయం అందుతుందని తెలిపారు.

నియోజకవర్గ స్థాయిలో న్యాయ సహాయం ఎవరికి అవసరమైన గిద్దలూరు కోర్ట్ లోని మండల న్యాయసేవాధికారసంస్థను సంప్రదించవచ్చని తెలిపారు.జిలా పరిషత్ బాలుర,బాలికల పిల్లలకు జరిగిన యస్ ఐ రేటింగ్ లో మొదటి 3 బహుమతులు జడ్జి కోర్ట్ ఆవరణలో అందజేశారు. జడ్జి గడికోట గ్రామంలో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో రైతులకు చట్టాల గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వై.సరిత, తహసీల్దార్ ఎం. రాజా రమేష్ ప్రేమ్ కుమార్, సీనియర్ న్యాయవాదులు లంకా జయరామయ్య,పి.రాజశేఖర్ రెడ్డి,హిమశేఖర్ రెడ్డి,ఏ.తిరుమల ప్రసాద్, ఎమ్.పిచ్చయ్య,డి.సంగీతారావు,సీనియర్,జూనియర్ న్యాయవాదులు,పారాలీగల్ వాలంటీర్ అద్దంకి. మధుసూధనరావు,కోర్ట్ సిబ్బంది,కక్షి దారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement