న్యూఢిల్లీ – ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. అనంతరం ఆర్థిక సర్వేను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.
ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ …
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (మధ్యంతర బడ్జెట్)ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు సమావేశ తేదీలను పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ ఖరారు చేసింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ఎన్డీయే సర్కార్‌కు ఇదే చివరి బడ్జెట్ కానున్నది. బడ్జెట్ పై చర్చకు రెండు రోజులు కేటాయించారు.. చివరి రోజున బడ్జెట్ చర్చపై ప్రధాని ప్రసంగం ఉంటుంది..