పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రారంభమయింది. దీంతో ఈ సారి కూడ పలు బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టనుంది. 31 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అందులో 29 బిల్లులు కాగా.. మరో రెండు ఆర్థికాంశాలను సభలో పెట్టనుంది. అందులో ఆర్డినెన్సుల స్థానంలో ఆరు బిల్లులను తీసుకురానుంది. కీలకమైన దివాలా, విద్యుత్, డీఎన్ ఏ టెక్నాలజీ బిల్లులను ప్రవేశపెట్టనుంది. బిల్లుల వివరాలు ఓ సారి పరిశీలిద్దాం..
ట్రైబ్యునల్ సంస్కరణల (హేతుబద్ధీకరణ, సేవల షరతులు) బిల్లు 2021
దివాలా నిబంధనల సవరణ (ఇన్ సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్ట్సీ) బిల్లు 2021
దేశ రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాల వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్ బిల్లు 2021
రక్షణ ఆవశ్యక సేవల బిల్లు 2021
భారత వైద్య కేంద్ర మండలి సవరణ బిల్లు 2021
హోమియోపతి కేంద్ర మండలి సవరణ బిల్లు 2021
విద్యుత్ సవరణ బిల్లు 2021
డీఎన్ ఏ సాంకేతికత (వినియోగం విధివిధానాలు) నియంత్రణ బిల్లు 2019
కారణాంక (ఫ్యాక్టరింగ్) నియంత్రణ సవరణ బిల్లు 2020
సహాయ పునరుత్పాదక సాంకేతికత నియంత్రణ బిల్లు 2020
తల్లిదండ్రులు, వృద్ధుల బతుకుదెరువు, సంక్షేమ సవరణ బిల్లు 2019
నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ మేనేజ్ మెంట్ బిల్లు 2019 (ఇప్పటికే రాజ్యసభలో పాసైంది)
నౌకాయానానికి సముద్ర సహకార బిల్లు 2021 (లోక్ సభలో పాసైంది)
చిన్నారుల న్యాయ (రక్షణ భద్రత) సవరణ బిల్లు 2021 (లోక్ సభలో పాసైంది)
సరోగసీ నియంత్రణ బిల్లు 2019
బొగ్గు గనుల ప్రాంతాల/భూముల (సేకరణ, అభివృద్ధి) సవరణ బిల్లు 2021
చార్టెడ్ అకౌంటెంట్స్, ఖర్చు, అకౌంటెంట్స్ పనులు, కంపెనీ సెక్రటరీల సవరణ బిల్లు 2021
పరిమిత పూచీ (లయబిలిటీ) భాగస్వామ్య సవరణ బిల్లు 2021
కంటోన్మెంట్ బిల్లు 2021
ఇండియన్ అంటార్కిటికా బిల్లు 2021
సెంట్రల్ యూనివర్సిటీల సవరణ బిల్లు 2021
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్ బిల్లు 2021
పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ సవరణ బిల్లు 2021
బీమా డిపాజిట్, రుణ హామీ కార్పొరేషన్ సవరణ బిల్లు 2021
భారత సముద్ర మత్స్యశాఖ బిల్లు 2021
పెట్రోలియం, ఖనిజాల పైప్ లైన్స్ సవరణ బిల్లు 2021
స్థానిక ఓడల బిల్లు 2021
ఇది కూడా చదవండి : ఆ బిల్లు పార్లమెంట్లోకి వస్తే దేశమంతా అంధకారం చేస్తాం