Saturday, September 21, 2024

Paris Olympics | విక్ట‌ర్ గోల్డెన్ విక్ట‌రీ..

ప్యారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పోరులో విక్టర్ ఆక్సెల్సన్ స్వర్ణం సాధించాడు. ఈరోజు జరిగిన పురుషుల బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో, డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ నంబర్ రెండో ర్యాంక్ ఆటగాడు విక్టర్… థాయ్‌లాండ్‌కు చెందిన కున్లౌట్‌ వితిద్సరన్‌తో తలపడ్డాడు.

కాగా, ఈ మ్యాచ్ వరుస సెట్లలో ఓడించి కున్లావుట్ ను చిత్తు చేశాడు విక్టర్. తొలి సెట్ ను 21–11 తో దక్కంచుకున్న విక్టర్… రెండో సెట్ ను కూడా 21– 11 తో ముగించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

దీంతో థాయ్‌లాండ్‌కు చెందిన కున్లౌట్ విత్‌సరణ్ రన్నరప్‌గా నిలిచి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఇక‌ ఇప్పటికే మలేషియాకు చెందిన నా లి జీ జియా లక్ష్య సేన్‌పై విజయం సాధించి కాంస్యం గెలుచుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement