Thursday, November 21, 2024

Paris Olympics – ప్రీ క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ లో సింధూ , ల‌క్ష్య‌ సేన్

పారిస్ ఒలింపిక్స్ లో భాగంగా మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు సత్తా చాటుతుంది. నేడు జ‌రిగిన మహిళల సింగ్స్ రెండో రౌండ్‌లో ఎస్తోనియా దేశానికి చెందిన క్రిష్టినా కుబాపై గెలుపొందింది. 21-5, 21-10 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సింధు రౌండ్ 16 ఫ్రీ క్వార్టర్స్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ కేవలం 32 నిమిషాల్లోనే ముగిసింది. మ్యాచ్ ప్రారంభం నుంచే పీవీ సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లలోనూ మాల్దీవులకు చెందిన ఫాతిమా అబ్దుల్ రజాక్ పై విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. 2016లో రియో గేమ్స్ లో రజత పతకం, టోక్యోలో జరిగిన గత ఎడిషన్ లో కాంస్యం సాధించింది. ఇప్ప‌డు గోల్డ్ మెడ‌ల్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో దూసుకుపోతున్న‌ది..

ల‌క్ష్య‌సేన్ కూడా…

ఈ రోజు జ‌రిగిన మ‌రో మ్యాచ్ లో లక్ష్య సేన్ విజయం సాదించి ప్రీ క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ కు చేరుకున్నాడు . ఇండోనేషియా క్రీడాకారుడు జోనాథ‌న్ క్టిస్టిపై 21- 18 , 21 – 12 స్కోర్ తో వ‌రుస సెట్ లో ఓడించి ముందంజ‌వేశాడు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement