Sunday, November 17, 2024

Paris Olympics | ఒలింపిక్స్‌లో నేడు భారత్‌..

పారిస్ ఒలింపిక్స్‌లో ఈరోజు 3 ముఖ్యమైన పోటీలు జరగనున్నాయి. పురుషుల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్… బ్యాడ్మింటన్‌లో లక్షసేన్ సెమీఫైనల్… బాక్సింగ్‌లో లవ్లీనా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. ప్రస్తుతం దేశం మొత్తం ఈ పోటీలపై ఆశలు పెట్టుకుంది. ఇక వీరితోపాటు పలు క్వాలిఫికేషన్ మ్యాచ్లు కూడా ఉన్నాయి. కాగా, ఈరోజు వివిధ పోటీల్లో భారత అథ్లెట్ల తలపడే వివరాలివే…

షూటింగ్‌:
పురుషుల విభాగం 25 మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ క్వాలిఫికేషన్‌ (విజయ్‌వీర్‌, అనీష్‌ భన్వాలా)
మహిళల స్కీట్‌ క్వాలిఫికేషన్‌ డే-2 (మహేశ్వరి చౌహాన్‌, రైజా దిల్లాన్‌)

గోల్ఫ్‌:
పురుషుల వ్యక్తిగత విభాగం స్ట్రోక్‌ ప్లే రౌండ్‌-4 (శుభ్‌శంకర్‌ శర్మ, గగన్‌జీత్‌)

హాకీ:
పురుషుల విభాగం క్వార్టర్‌ ఫైనల్‌ (భారత్‌-గ్రేట్‌ బ్రిటన్‌)

- Advertisement -

అథ్లెటిక్స్‌:
మహిళల 3000మీ స్టీప్లిచేస్‌ రౌండ్‌-1 (పారుల్‌ చౌదరీ),
పురుషుల లాంగ్‌ జంప్‌ క్వాలిఫికేషన్‌ (జెస్వీన్‌ అల్డ్రిన్)

బాడ్మింటన్‌:
పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌ (లక్ష్యసేన్‌-అక్సెల్‌సెన్‌)

బాక్సింగ్‌:
మహిళల 75 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్స్‌ (లవ్లీనా-లీ ఖియాన్‌)

సెయిలింగ్‌:
పురుషుల డింగీ ఈవెంట్‌ (విష్ణు సరవనన్‌),
మహిళల డింగీ ఈవెంట్‌ (నేత్ర కుమనన్‌).

Advertisement

తాజా వార్తలు

Advertisement