పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా ఈరోజు (సోమవారం) జరగాల్సిన బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ మ్యాచ్ రద్దయింది. గ్రూప్ సిలో ఉన్న భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్‌లు నేడు జర్మనీ జోడీ మార్కస్ లామ్స్‌ఫస్, మార్విన్ సీడెల్‌తో తలపడాల్సిం ఉంది. అయితే, ఆట మద్యలో జర్మన్ జోడీ మార్కస్ లామ్స్‌ఫస్ – మార్విన్ సీడెల్ గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలిగింది. దీంతో గ్రూప్ సిలో ప్రస్తుతం మూడు జట్లు మాత్రమే ఉన్నాయి.
కాగా, సాత్విక్ – చిరాగ్ లు తమ మొదటి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన లుకాస్ కార్వే – రోనన్ లేబర్లను ఓడించి గ్రూప్ సి స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచారు. ఇక తమ తదుపరి మ్యాచ్ రేపు జరగనుండగా… ఈ మ్యాచ్ లో ఇండోనేషియాకు చెందిన ఫజార్ అల్ఫియాన్-మహమ్మద్ రియాన్ ఆర్డియాంటోలతో తలపడనున్నారు.
మహిళల డబుల్స్ జోడీకి నిరాశే…
పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళల జోడీకి నిరాశే ఎదురైంది. గ్రూప్ సిలో అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో జోడీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి మూడో స్థానంలో కొనసాగుతొంది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన నమీ మత్సుయామా – చిహారు షిదా ల తలపడని భారత ద్వయం 11-21, 12-21తో వరుస సెట్లలో ఓడిపోయింది.
అంతకుముందు 27వ తేదీన జరిగిన తొలి మ్యాచ్‌లో అశ్విని-తనీషా జోడీ 18-21, 10-21తో వరుస సెట్లలో దక్షిణ కొరియాకు చెందిన కాంగ్ హీ-యోంగ్, కిమ్ సె-యంగ్ జోడీపై ఓడిపోయింది. కాగా, రేపు ఆస్ట్రేలియా ద్వయం సెట్యానా మపాసా, ఏంజెలా యుతో తలపడనుంది.