పారిస్ ఒలింపిక్స్ 33వ ఎడిషన్ ప్రారంభ వేడుకలకు సర్వం సిద్ధమైంది! ఒలింపిక్స్‌లో తొలిసారిగా స్టేడియం బయట ఓపెనింగ్ సెర్మనీ జరుగుతుండగా… అథ్లెట్ పరేడ్ సెయిన్ నదిపై జరుగనుంది. కాగా, భారత కాలమానం ప్రకారం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ ప్రారంభ వేడుకలో దాదాపు 10,000 మందికి పైగా ఒలింపిక్ పాల్గొననున్నారు.
కాగా, ఈ ప్రారంభ వేడుకల సందర్భంగా అథ్లెట్ల పరేడ్‌లో భారత్ తరుఫున పివి సింధు, ఆచంట శరత్ కమల్ తొలిసారి ఫ్లాగ్-బేరర్లుగా ఉండనున్నారు. వీరి నేతృత్వంలోని పాల్గొనే బృందంలో 12 క్రీడా విభాగాలకు చెందిన 78 మంది అథ్లెట్లు, అధికారులు ఉంటారు.
సింధు, శరత్ కమల్‌లతో పాటు ఆర్చర్ దీపికా కుమారి, బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మానికా బాత్రా, టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న వంటి ప్రముఖ క్రీడాకారులు ఉన్నారు. ఇక, మల్టీ స్పోర్ట్స్‌లో 47 మంది మహిళలు సహా 117 మంది అథ్లెట్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.