కాంస్యం కోసం హాకీ పోరు
రెజ్లింగ్ బరిలో ఆ ఇద్దరు
అధ్లెటిక్స్ హీట్స్ లో మన జ్యోతి
గోల్ప్ లోనూ మనోళ్లు…
నేడు బరిలో బల్లెం వీరుడు…
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఈరోజు ఊహించని షాక్ తగిలింది. అసాధారణ ఆట తీరుతో ఫైనల్ చేరి స్వర్ణ పతక ఆశలు రేకెత్తించిన స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనూహ్యంగా అనర్హత వేటు పడింది. రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో అంతిమ్ పంఘల్ తొలి రౌండ్‌లో టర్కీ రెజ్లర్ చేతిలో ఓడిపోయింది. మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు క్వార్టర్స్‌లో జర్మనీ చేతిలో ఓడిపోయింది. అథ్లెటిక్స్‌లోనూ హైజంపర్ స్వప్నిల్ కుసారే ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. మహిళల జావెలిన్ త్రోలో అన్నూ రాణి నిరాశపరిచింది.కాగా నేడు పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు కీలకమైన మ్యాచ్‌లు ఉన్నాయి. భారత అథ్లెట్లు రెండు పతక ఈవెంట్లలో పోటీపడనున్నారు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో బల్లెం వీరుడు నీరజ్ చోప్రా బరిలోకి దిగనుండగా.. కాంస్య పతక పోరులో భారత హాకీ జట్టు స్పెయిన్ తో తలపడనుంది.
రేపటి భారత షెడ్యూల్ ఇదే..!
గోల్ఫ్
మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే-రౌండ్ 2- దిక్ష దగర్-
మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే-రౌండ్ 2- అదితి అశోక్-
అథ్లెటిక్స్
మహిళల 100 మీటర్ల హర్డల్స్-రీప్‌చేజ్-హీట్ 1- జ్యోతీ ఎర్రాజీ-
పురుషుల జావెలిన్ త్రో ఫైనల్-నీరజ్ చోప్రా- రాత్రి 11.55 గంటలకు
హాకీ
కాంస్య పోరు: భారత్ వర్సెస్ స్పెయిన్- సాయంత్రం 5.30 గంటలకు
రెజ్లింగ్
మహిళల 57 కేజీల ఫ్రీస్టైల్ 1/8 ఫైనల్స్ – అన్షు మాలిక్ వర్సెస్ హెలెన్ మరౌలిస్(అమెరికా)-
మహిళల 57 కేజీల ఫ్రీస్టైల్ 1/8 ఫైనల్స్ – అమన్ సెహ్రావత్ వర్సెస్ వ్లాద్‌మిర్ ఇగోరోవ్(మెకోడోనియా)-