Monday, December 23, 2024

Parawada – ఫార్మా సిటీలో మరోసారి విష వాయువులు లీక్

పరవాడ, పరవాడ ఫార్మాసిటీలో రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు అస్వస్థతకి గురయ్యారు.సోమవారం.తెల్లవారుజామున 5:30 గంటలకి ప్రొడక్షన్ బ్లాక్ 1 హైడ్రోజన్ సల్ఫేడ్ వాయువులు విడుదలతో ఈ ప్రమాదంలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు.. గురైన ఇద్దరు కార్మికుల్ని వారిలో ఒకరు రాయగడ. కాశిపూర్. గ్రామానికి చెందిన ఉగ్రెసర్ గౌడ 26 మరొకరు (ఒరిస్సా ) దేవ్ బ్యాగ్ 38 ఇద్దరు కార్మికులు అస్వస్థతకి గురయ్యారు.ఈ ప్రమాదానికి గురైన ఇద్దరు వ్యక్తులను విశాఖ నగరంలోని కిమ్స్ ఐకాన్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతానికి ఒకరికి ప్రాణాపాయ అవకాశం లేకపోయినా మరొకరు ఆసుపత్రిలో ఐసీయూలో కార్మికుడికి సీరియస్ గా ఉందని వైద్యులు చెబుతున్నారు.

పరిశ్రమం గేటు వద్ద కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఫార్మా సిటీలో పలు కంపెనీల్లో ప్రమాదాలు జరగడం పలువురు కార్మికులు మృతి చెందడం కేవలం ఆరు నెలల కాలంలో జరిగింది. రక్షిత్ పరిశ్రమలో ప్రమాదం జరిగేందుకు యాజమాన్య నిర్లక్ష్య వైకిరే కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కనీస భద్రతా పరికరాలు లేకుండానే ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు…ప్రమాదానికి గురైన ఇద్దరు వ్యక్తులను వీరికి మెరుగైన వైద్యం అందించి జరిగిన ప్రమాదం పై సమగ్ర విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణడిమాండ్ చేశారు. భద్రత ప్రమాణాలు పాటించడం,కార్మికుల రక్షణ భద్రత,వంటి చర్యలు ప్రతిష్టవంతంగా చేపట్టాలని గని శెట్టి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement