Wednesday, November 20, 2024

Big Story : చిన్న వయసులోనే పక్షవాతం.. 45ఏళ్లలోపు వారిలో 24శాతం మందికి లక్షణాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: 45 ఏళ్లలోపు వారిలో 24 శాతం మంది పక్షవాతం వ్యాధి లక్షణాల్లో ఏదో ఒకదానితో బాధపడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఇప్పటి వరకు వయసు మీరిని వారికే సంక్రమించే ఈ వ్యాధి ఇటీవల కాలంలో చిన్నవయసు వారికి సోకుతోంది. వ్యాధి లక్షణాలను గుర్తించి సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళితె అంగవైకల్య ప్రమాదాన్ని నివారించొచ్చని కేర్‌ ఆసుపత్రుల వైద్యులు చెబుతున్నారు. పక్షవాతం వ్యాధిపై గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యులు, ప్రజలకు అవగాహన లేకపోవడంతో పక్షవాతానికి గురైన వారు శాశ్వత అంగవైకల్యం బారినపడుతున్నారు. రక్తపోటు, మధుమోహం ఉన్నవారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని, పక్షవాతంతో బాధపడుతున్న వారిలో 60శాతం మంది బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, రక్తంలో కొవ్వుతాతం ఎక్కువగా ఉన్నవారికి మద్యం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే చిన్న వయసులోనే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. భారత్‌లోనూ పక్షవాతం రోగుల్లో ఏళ్లలోపు వారు 24 శాతం వరకు ఉండటం ఆందోళనకరమంటున్నారు. శరీరంలో ఏదైనా ఒక భాగం, ప్రాంతం ముెెద్దుబారినట్లు, ముఖం కండరాలు పక్కకు లాగినట్లు శరీరంలో ఏదైనా ప్రాంతంలో తిమ్మిర్లు ఉన్నట్లు (స్పర్శలో తేడా), ఒక్కసారిగా కంటిచూపు మందగించడం వణుకుడు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా త్వరగా ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. నాలుగున్నర గంటల్లో చికిత్సలు ప్రారంభిస్తే ఆంగవైకల్యానికి గురికాకుండా పూర్తి స్వస్తత చేకూరడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

- Advertisement -

ఉద్యోగులూ జాగ్రత్త…

కంప్యూటర్‌పై కార్యాలయాల్లో ఎక్కువ సేపు కూర్చుని పని చేసేవారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకే భంగిమల్లో కుర్చీలో ఆరగంటకు మించి కూర్చోకూడదని స్పష్టం చేస్తున్నారు. కంప్యూటర్లపై పనిచేసే వారు విధిగా ప్రతి అరగంటకు ఒకసారి శరీరంలోని మిగిలిన భాగాలను కొద్దిగా కదల్చడం తప్పకుండా చేయాలని సూచిస్తున్నారు. కూర్చుని పనిచేసేవారు వెన్నముక నిటారుగా ఉండే విధంగా చూసుకోవాలని, తలవెనుక బాగంలో తరచుగా నొప్పి ఉన్నట్లు ఉంటే… వెన్నముకపై భారం పడుతున్నట్లు గుర్తుంచుకోవాలంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని భాగాలతో పాటు మెదడుకు రక్తప్రసరణపై ప్రభావం పడుతుందంటున్నారు.

వేగంగా స్పందించాలి..

పక్షవాతం లక్షణాలు గమనించిన వెంటనే రోగిని ఆసుపత్రికి తరలించడం చాలా అవసరం. మెదడుకు రక్తం సరఫరా తగ్గినప్పుడు క్షణక్షణానికీ మెదడులోని కణాలు (న్యూరాన్లు) ఆక్సిజన్‌ అందక చనిపోతూ ఉంటాయి. పక్షవాతం వచ్చిన 34గంటల తరువాత ఈ కణాలు తిరిగి కోలుకోలేని రీతిలో చనిపోతాయి. ఆ తరువాత వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ కణాలను తిరిగి బతికించలేరు. కాబట్టి పక్షవాతం వచ్చిన మొదటి మూడు గంటల్లోనే ఆసుపత్రికి వెళితే వైద్యులు టిష్యూ ప్లాస్మినోజన్‌ యాక్టివేగర్‌ అనే మందులను ఇంజక్షన్‌ ద్వారా రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీనివల్ల రక్త నాళాలలో ఏర్పడిన పూడికలు తొలగిపోతాయి. దీంతో మళ్లి యధావిధిగా మొదడుకు రక్తం సరఫర ఆయి పక్షవాతం ప్రమాదం నుంచి బయటపడొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement