Thursday, November 21, 2024

paralympics: జావెలిన్ త్రో విభాగంలో భారత్ కు స్వర్ణం..

టోక్యో పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే భారత్ ఖాతాలో ఓ స్వర్ణం ఉండగా ఇప్పుడ మరో స్వర్ణం వచ్చి చేరింది. జావెలిన్ త్రో క్రీడాకారుడు సుమీత్ ఆంటిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఎఫ్64 కేటగిరీలో నేడు జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో సుమీత్ ఆంటిల్ స్వర్ణం గెలిచాడు. జావెలిన్ ను 68.55 మీటర్ల దూరం విసిరిన సుమీత్ ఈ క్రమంలో సరికొత్త వరల్డ్ రికార్డు కూడా నమోదు చేశాడు. తన తొలి ప్రయత్నంలో 66.95 మీటర్లు విసిరిన సుమీత్, రెండో ప్రయత్నంలో మరింత మెరుగయ్యాడు. ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి నూతన ప్రపంచ రికార్డు స్థాపించాడు. ఈ పోటీలో ఆస్ట్రేలియాకు చెందిన మైఖేల్ బరియాన్ రజతం సాధించగా, శ్రీలంక పారా అథ్లెట్ దులన్ కొడితువాక్కు కాంస్యం దక్కించుకున్నాడు. టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మహిళా షూటర్ అవని లేఖర తొలి స్వర్ణం అందించడం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌ పతకాల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.

https://twitter.com/pockingliberals/status/1432300997439746049
Advertisement

తాజా వార్తలు

Advertisement