Friday, September 13, 2024

Para Olympics – షాట్ పుట్ లో స‌చిన్ కు ర‌జ‌తం…..

పారాలింపిక్స్‌లో భారత్‌ మరో రజత పతకం సాధించింది. పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46లో ప్రపంచ ఛాంపియన్‌ సచిన్ సర్జేరావు ఖిలారీ (16.32 మీ) రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. కెనడాకు చెందిన గ్రెగ్ స్టువర్ట్ (16.38 మీ) స్వర్ణం కైవసం చేసుకున్నాడు. క్రోయేషియా అథ్లెట్‌ బకోవిక్ లుకా (16.27 మీ) కాంస్యం సాధించాడు. ఇదే విభాగంలో పోటీపడిన భారత అథ్లెట్లు మహ్మద్ యాసర్, రోహిత్‌ కుమార్‌ వరుసగా ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో నిలిచారు. ఈ పారాలింపిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత్‌కిది 11వ పతకం కాగా.. ఓవరాల్‌గా మెడల్స్‌ సంఖ్య 21కి చేరింది.

మరోవైపు.. టేబుల్ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌54లో భారత్‌కు నిరాశ ఎదురైంది. టోక్యోలో రజతం సాధించిన భవీనా పటేల్ ఈ సారి క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. 1-3 (12-14, 9-11, 11-8, 6-11)తో యింగ్ జౌ (చైనా) చేతిలో ఓటమిపాలైంది. షూటింగ్‌ మిక్స్‌డ్‌ 50 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్‌1 క్వాలిఫికేషన్‌లో నిహాల్ సింగ్ 19వ, రుద్రాంశ్‌ ఖండేవాల్ 22వ స్థానాల్లో నిలిచారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement