బోటు విహారం అంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో జరిగిన బోటు ప్రమాద ఘటన అందరిని కలచి వేసింది. దాంతో అక్కడ బోటు పర్యాటనం నిలిచిపోయింది. అయితే ఈ బోటు పర్యాటకం సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో జరిగిన పాపికొండలు విహారయాత్ర ఎంతోai ఆనందంగా సాగింది. మరోసారి ఎటువంటి విషాధ ఘటనలకు ఆస్కారం ఉండకూడదని పర్యాటకానికి వినియోగించే ప్రతి బోటును అధికారులు తనిఖీ చేశారు.
అధికారుల తనిఖీల అనంతరం ఏపీ టూరిజం శాఖకు చెందిన హరిత బోటులో 35 మంది గోదావరిలో జల సవ్వడి.. పచ్చని కొండల అందాలను ఆస్వాదిస్తూ దేవీపట్నం మీదుగా పాపికొండలుకు చేరారు. బోటు పర్యాటకం తిరిగి ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉందని పర్యాటకులు అంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎందరో పర్యాటకులు పాపికొండలను వీక్షించి సంబరపడిపోయారు. ఈ ప్రయాణంలో పర్యాటకులతోపాటు ఏపీ టూరిజం కాకినాడ డివిజనల్ మేనేజర్ వీరనారాయణ సైతం పాల్గొన్నారు. పోశమ్మగండి వద్దనుంచి బయల్దేరిన బోటు పూడిపల్లి, దేవీపట్నం మీదుగా సాగింది. సాధారణంగా కచ్చులూరు మీదుగా వెళ్లే బోటును ఈ సారి నది మధ్యనుంచి తీసుకెళ్లారు. ఈ బోటు ప్రయాణం ఎంతో బాగుందని పర్యాటకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు