రెండు సంవత్సరాల క్రితం కచ్చులూరు ప్రాంతంలో బోటు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు రోజు పాటు శ్రమించి మునిగిన బోటును బయటకి తీశారు. ఈ ఘటనలో పలువురు మృత్యువాత పడిన సంగతి విదితమే. ప్రస్తుతం మళ్లీ పాపికొండల టూర్ ను ప్రభుత్వం ప్రారంభించింది. గత అనుభవాలతో పాపికొండల టూర్ కు ప్రభుత్వం అన్ని భద్రతా ఏర్పాట్లు చేసింది. 5 కమాండ్ కంట్రోల్ రూంలతో పాటు.. ప్రతీ బోటుకు ఎస్కార్ట్ బోటును తప్పని సరి చేసింది. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని బోట్ రూట్ ఆపరేటర్లకు, ఫెర్రీ ఆపరేటర్లు నిబంధనలు పాటించాలని హెచ్చరించింది ప్రభుత్వం. బోట్ లో ప్రయాణించే వారు తప్పని సరిగా లైఫ్ జాకెట్లను ధరించాలని అధికారులు సూచించారు. రాజమండ్రి నుంచి పాపికొండల దాకా విహారయాత్రకు బోట్లు బయలుదేరుతాయి. ఈ రోజు నుంచి పూర్తిస్థాయిలో పాపికొండల బోట్ టూర్ ను ఆపరేట్ చేయనున్నారు. నేడు గండిపోచమ్మ నుంచి బోట్లను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్దం చేశారు అధికారులు.
Advertisement
తాజా వార్తలు
Advertisement