టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు పాకిస్థాన్‌తో జరుగుతున్న పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆలౌట్ అయ్యింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు పాక్ పేసర్లు ఆదిలోనే షాకిచ్చారు. రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. నసీం, షాహీల బౌలింగ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ(12), విరాట్ కోహ్లీ(4)లు స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ జట్టను ఆదుకున్నాడు. దాయాదితో పోరులో టాపార్డర్ విఫలైమనా రిషభ్ పంత్ (42) పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లోని మిగతా బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్ కి క్యూ కట్టారు. రోహిత్ శర్మ (13), అక్షర్ పటేల్ (20), రిషబ్ పంత్ (42) మినహా మిగతా కీలక బ్యాట్స్‌మెన్లు అంతా సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో 19 ఓవర్లలో 119 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయ్యింది.
పాక్ బౌలర్లలో నసీమ్ షా, హరీస్ రవూఫ్ మూడు వికెట్లు తీయగా… మహ్మద్ అమీర్ రెండు వికెట్లు, షాహీన్ అఫ్రిది ఒక వికెట్ తీశారు. దీంతో 120 పరుగుల లక్ష్యంతో పాక్ జట్టు ఛేజింగ్ ప్రారంభించనుంది.