ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో అక్కడున్న తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం బారిన పడిన ఉక్రెయిన్ దేశంలో తెలంగాణకు చెందిన పలువురు విద్యార్థులు చిక్కుకున్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు గంజి భానుప్రసాద్, శేషఫణిచంద్ర ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్నారు. రాజధాని కీవ్ ఎయిర్‌పోర్ట్‌ను రష్యా సైనికులు ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఈ విద్యార్థులు జాఫ్రోజీ కాలేజీలో తలదాచుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన జాలి ప్రణయ్‌కుమార్‌రెడ్డి వైద్య విద్యను ఉక్రెయిన్‌లో అభ్యిసిస్తున్నాడు. ప్రణయ్ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రణయ్ అక్కడే చిక్కుకున్నాడు. ఆ విద్యార్థులు అక్కడే ఉండడంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital