Wednesday, November 20, 2024

పర్వతారోహణకు అనువుగా పాన్‌గల్‌ ఖిల్లా.. ట్రైనింగ్ కోసం త‌ర‌లివ‌స్తున్న ఔత్సాహికులు

పాన్‌గల్‌, (ప్రభ న్యూస్‌): ఎత్తైన కొండలు , పర్వతాలను అధిరోహించాలని అభిలషించే వారికి శిక్షణ నివ్వడానికి పాన్‌ గల్‌ ఖిల్లా గట్టు అనువుగా ఉందని ట్రెక్కింగ్‌ చీఫ్‌ ఇన్‌ స్ట్రక్టర్‌ రాజేందర్‌ కుమార్‌ వెల్లడించారు. గత డిసెంబర్‌ 11న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ మౌంటెనీరింగ్‌ క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్‌ కుమార్‌ తో కలిసి పాన్‌ గల్‌ కోటను సందర్శించామని అన్నారు. ఖిల్లా గట్టుపై తాళ్ళు తదితర పర్వతారోహణ సామాగ్రితో పెద్ద, పెద్ద గుండ్లపై నుంచి దిగి విన్యాసాలను ప్రదర్శించామని అన్నారు. ఖిల్లా శిఖరాగ్రాన ఉన్న బాలహిస్సారు, రామగుండం, సీతా గుండాలతో పాటు ట్రెక్కింగుకు ఉపయోగపడే పలు ప్రాంతాలను గుర్తించామని అన్నారు.

పర్వతాలు, కొండలపై గల భౌగోళిక , ప్రాచీన చారిత్రక, సాంస్కృతిక స్థతిగతుల అధ్యయనం , రాపెల్లింగ్‌ రాక్‌, క్లెబింగ్‌ , ఝూమరింగ్‌ తదితర ప్రతిభా పాటవాల ప్రదర్శన పోటీలు నిర్వహించడానికి దోహద పడుతుందని అన్నారు. స్థానిక ఎంపీపీ, జెడ్పీ కోఆప్టెడ్‌ మెంబర్‌ , సర్పంచు, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా కార్యదర్శి ఖాజా కుతుబుద్దీన్‌, పాన్‌ గల్‌ కు చెందిన వడ్డె దాసర్ల పాపయ్య తదితరులు తమకు సహకరించారని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement