Friday, November 22, 2024

సేంద్రియసాగుకు పంచాయతీలే కీలకం : ప్రధాని మోదీ..

ఎన్నోఏళ్లుగా రిజర్వేషన్లకు దూరమైన జమ్మూ ప్రజలు ఇప్పుడు వాటికి అర్హులు. మునుపటి తరాలు చూసిన సమస్యలు నేటి జమ్మూ యువత ఎదుర్కోదు’ అని ప్రధాని పేర్కొన్నారు. తమ తాతలు, తండ్రులు ఎన్ని ఇబ్బందులు పడుతూ జీవించారో.. ప్రస్తుత తరానికి అన్ని ఇబ్బందులు లేకుండా చూస్తామని, యువతకు మంచి భవిష్యత్తు అందేలా చర్యలు చేపడతామని మోడీ హామీ ఇచ్చారు. ఇన్ని ఏళ్లలో జమ్ము-కాశ్మీర్‌కు కేవలం 17 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని, కానీ.. గత రెండేళ్లలో అవి 38 వేల కోట్లకు చేరాయని ప్రధాని అన్నారు.

ఇక దేశవ్యాప్తంగా పంచాయతీలను ఉద్దేశించి మాట్లాడిన మోడీ సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేయడంలో గ్రామ పంచాయతీలు కీలకంగా వ్యవహరించాలన్నారు. రసాయనాల వాడకాన్ని పూర్తిగా తగ్గించి మాతృభూమిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement