జాతీయ జెండా ఎగురవేశాడని ఓ దళిల సర్పంచ్ పై గ్రామ కార్యదర్శి దాడి చేసిన అమానుష ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఛత్తర్‌పూర్‌లోని ధాంచీ గ్రామస్తులు..స్థానిక పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో సదరు గ్రామ కార్యదర్శి సునీల్ తివారి సమయానికి రాలేదు. దీంతో గ్రామస్తులు సర్పంచ్ ని జెండా ఎగురవేయాలని కోరడంతో.. వాని కోరిక మేరకు హన్ను బాసర్ జెండాను ఎగురవేశారు. అయితే జెండా కార్యక్రమం ముగిసిన అనంతరం అక్కడికి చేరుకున్న సునీల్ ఆగ్రహంతో సర్పంచ్ పై పిడిగుద్దులతో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా.. అడ్డు వచ్చిన సర్పంచ్ భార్య.. కోడలిపై కూడా దాడిచేశాడు. ప్రస్తుతం ఈ సంఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కార్యదర్శిపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సర్పంచ్, అతని భార్య.. సెక్రెటరీ సునీల్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా ఘటనపై కూడా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా