Friday, November 22, 2024

India: ఐటీ శాఖ పాన్‌ ఇండియా దాడులు.. గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై ఈసీ కేసులు

ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం పాన్‌ ఇండియా దాడులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా పలువురిపై నమోదైన పన్ను ఎగవేత ఆరోపణల ఆధారంగా ఐటీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు నిధులు సమకూరుస్తున్నారనే ఆరోపణలపై అధికారులు దాడులు నిర్వహించారు. గుజరాత్‌, ఢిల్లిd, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, హర్యానాలతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో సైతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్‌యుపీపీఎస్‌, సంబంధిత వ్యక్తులు, ఆపరేటర్లు, ఇతరులపై కూడా ఐటీ శాఖ కేసులు నమోదు చేసింది.

కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సులపై ఐటీ శాఖ ఆకస్మిక దాడుల నిర్వహించింది. బోగస్‌ రాజకీయపార్టీలు 87 సంస్థలను గుర్తించింది. పేపర్లు, డాక్యుమెంట్లలో తప్ప ఆ పార్టీలకు ఎక్కడా కార్యాలయాలు లేవని ఎన్నికల సంఘం గుర్తించింది. దీంతో, రిజిస్టర్‌ అయిన 2,100 గుర్తింపులేని రాజకీయ పార్టీలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. ఈ రాజకీయ పార్టీలకు అందిన విరాళాలతో పాటురాజకీయ పార్టీల అడ్రస్‌, పేర్లు, ఆఫీస్‌ బేరర్లను అప్‌డేట్‌ చేయడంలో విఫలమయ్యాయి. అంతేకాక తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు కూడా ఎదుర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement