పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానికి కేంద్రం మరోసారి గడువు పెంచింది. ఇప్పటికే పలు మార్లు గడువును పొడిగిస్తూ వచ్చిన కేంద్రం.. తాజాగా మూడు నెలలపాటు గడుపును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో జూన్ 30 వరకు గడువు విధించింది. అయితే, తాజాగా పాన్ కార్డు-ఆధార్ అనుసంధానం గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 139 ఏఏ ప్రకారం ప్రతి పౌరుడు తమ ఆదాయ వివరాల సమర్పణ పత్రంలోనూ, పాన్ కార్డు దరఖాస్తులోనూ ఆధార్ నెంబరు పొందపరచడం తప్పనిసరిస. ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు సెప్టెంబరు 30 తర్వాత చెల్లుబాటు కావని కేంద్రం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: గజపతులంటే నిజాం నవాబులకు బానిసలు: అశోక్ గజపతిపై విజయసాయి