ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాంనగర్ లో 34 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కూరగాయల మార్కెట్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన, రూ 11 లక్షల వ్యయంతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పల్లెలన్ని పట్టణాలుగా , పట్టణాలు ఆధునిక జరగాలని లక్ష్యంతో పల్లె ప్రగతి పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి తో రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. గతంలో మహిళలు ప్రయాణాల్లో నగరంలో టాయిలెట్స్ కోసం బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు పడే వాళ్లని ఆ సమస్యను అధిగమించాలని, నగరం పరిశుభ్రంగా ఉండాలని పట్టణ ప్రగతి లో 23 టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రత్యేకంగా మహిళల కోసం ఇంకా 3 పింకు టాయిలెట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలో మార్కెటు లేక రోడ్లపై వ్యాపారులు కూరగాయలు అమ్మే వారని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పల్లె ప్రగతి, పట్టణ నీతో ప్రజల జీవన శైలి ఆధునీకరణ జరిగిందన్నారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని మంత్రి ప్రజలను కోరారు. రోడ్లపై ఆక్రమణలు జరగకుండా చూడాలని అన్నారు. ఫుట్ పాత్ ల పై పాదచారులు మాత్రమే నడవాలి అన్నారు. కరీంనగర్ నగరాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలన్నారు. కెసిఆర్ పార్టీ ప్రకటనతో దేశవ్యాప్త చర్చ మొదలైందని ప్రజలు కెసిఆర్ పాలన కోరుకుంటున్నారని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. కాళేశ్వరం జలాలతో ప్రతి ఎకరాకు మీరు ఇవ్వడంతో పంట 10 రేట్లు పెరిగిందన్నారు. రాష్ట్రంలో తాగునీటి సాగునీటి సమస్య తీరిందని ఇతర రాష్ట్రాల ప్రజలు అందరూ తెలంగాణ వైపు చూస్తున్నారని అన్నారు. ప్రజలు ఏదైతే కోరుకుంటారు కెసిఆర్ అదే చేస్తాడని మంత్రి అన్నారు
ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు బండారి వేణు దిండిగాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా- పల్లె ప్రగతి పట్టణ ప్రగతి- మంత్రి గంగుల
Advertisement
తాజా వార్తలు
Advertisement