విశాఖ: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టిడిపి నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాసరావును దీక్ష శిబిరం నుంచి నగరంలోని కృషి ఐకాన్ ఆసుపత్రికి బలవంతంగా తరలించారు. గత ఆరురోజులుగా పల్లా ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున దీక్షా శిబిరానికి చేరుకున్న పోలీసులు పల్లా దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో తరలింపును అడ్డుకునేందుకు కార్యకర్తలు యత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా, పల్లా దీక్షకు సంఘీభావం తెలిపేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ఈ రోజు విశాఖ రానున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు ముందే పోలీసులు దీక్ష భగ్నం చేశారు.
హాస్పటల్లో దీక్ష కొనసాగింపు….
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు షీలానగర్ కిమ్స్ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆసుపత్రిలోనే పల్లా దీక్షను కొనసాగిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కి తీసుకునే వరకూ తన దీక్ష కొనసాగుతుందని పల్లా హాస్పటల్లో స్పష్టం చేశారు. కాగా, పల్లా యోగక్షేమాలు తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. పల్లా పరిస్ధితిని చూసి మహిళా కార్యకర్తలు కంటతడిపెడుతున్నారు.
పల్లా దీక్ష భగ్నం – హాస్పటల్లో కొనసాగింపు..
Advertisement
తాజా వార్తలు
Advertisement