Saturday, November 16, 2024

Tamil Nadu : పరువు నష్టం కేసు గెలిచిన పళనిస్వామి

  • రూ.1.10కోట్లు ప‌రిహారం
  • మ‌ద్రాస్ హైకోర్టు తీర్పు


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, చెన్నై : అన్నా డీఎంకే జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి మ‌ద్రాసు హైకోర్టులో వేసిన ప‌రువ‌న‌ష్టం దావా కేసు గెలిచారు. నిరాధార ఆరోపణలతో పళనిస్వామి ప్రతిష్ఠను దెబ్బతీసినందుకు నష్ట పరిహారంగా ఆయనకు రూ.1.10 కోట్లను చెల్లించాలని హైకోర్టు బెంచ్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ప్ర‌తివాది ధనపాల్‌కు వార్నింగ్ ఇచ్చింది.

కేసు పూర్వ‌ప‌రాలు…
తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత చెన్నై నివాసంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన సి.కనకరాజ్ 2017 ఏప్రిల్ 28న అనుమానాస్పద స్థితిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. సి.కనకరాజ్ మరణం అనంతరం అతడి సోదరుడు సి.ధనపాల్ ప‌లు ఆరోపణలు చేశాడు.

2017 ఏప్రిల్ 23న నీలగిరిస్ జిల్లా కొడనాడ్‌ పట్టణంలో ఉన్న 906 ఎకరాల జయలలిత ఎస్టేట్‌లో జరిగిన దొంగతనంతో అన్నాడీఎంకే జనరల్ సెక్రెటరీ ఎడప్పాడి పళనిస్వామికి సంబంధం ఉందని సి.ధనపాల్ ఆరోపించాడు. దీంతో తన పరువుకు నష్టం వాటిల్లిందని, రాజకీయ ప్రతిష్ఠ మసకబారిందని పేర్కొంటూ ఎడప్పాడి పళనిస్వామి కోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement