ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొంటున్న పాలస్తీనియన్లకు సహాయం అందించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం రాత్రి ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. కొవిడ్ సంక్షోభంతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న పాలస్తీనియన్లకు పాకిస్తాన్ ప్రభుత్వం వైద్య సహాయం అందించాలని నిర్ణయించారు. క్యాబినెట్ సమావేశం అనంతరం ఇమ్రాన్ ప్రభుత్వంలోని మంత్రి ఫవాద్ చౌదరి ఈ ప్రకటన చేశారు. తాజా ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 220 మంది మరణించారు. పాలస్తీనా సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేస్తుండగా.. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగుతున్నది.
ఇలాఉండగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ సంభాషణ జరిపినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నది. అయితే వీరి ఫోన్ సంభాషణకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని ఆ కథనంలో రాశారు. ఇజ్రాయెల్ పోరు నిలిపేలా ఒక వ్యూహం అమలుచేయడానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ టర్కీ వచ్చారు.