పాకిస్థాన్ ను చాలాకాలంగా ఉగ్రవాదం పట్టిపీడిస్తోందని, పాక్ ఎదుర్కొంటున్న సమస్యల్లో ఉగ్రవాదం ప్రధానమైనది ఉగ్రవాదమేనని దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఖైబర్ ఫక్తుంఖ్వాలోని లాకీ మార్వాత్ లో ఓ పోలీస్ వ్యాన్ పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీస్ వ్యాన్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో వ్యాన్ లో ప్రయాణిస్తున్న ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. వ్యాన్ పై జరిగిన ఉగ్రదాడిని ప్రధాని ఖండించారు. దాడిలో మృతిచెందిన పోలీసుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఉగ్రదాడిని ఖండించడానికి మాటలు రావడం లేదని చెప్పారు. ఉగ్రవాదంపై అత్యంత సాహసంతో పోరాడుతున్నారని పోలీసులు, సైనికులను ఆయన కొనియాడారు. ఈ మేరకు ప్రధాని షరీఫ్ బుధవారం ట్వీట్ చేశారు. ఖైబర్ ఫక్తుంఖ్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement