Saturday, November 23, 2024

ENG vs PAK | చిత్తుగా ఓడిన పాక్.. ఇంగ్లాండ్ ఘ‌న విజ‌యం

ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచకప్‌లో భాగంగా ఇవ్వాల జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. కోల్‌కతా వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 93 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక దీంతో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో విఫ‌ల‌మైన‌ ఇంగ్లాండ్ జ‌ట్టు 2025లో జ‌ర‌గ‌నున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీకి మాత్రం అర్హ‌త సాధించింది. పాకిస్తాన్ సెమీస్‌ చేరాలంటే 338 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్‌ 6.2 ఓవర్లలో ఛేదించాలి. కానీ ఇదీ సాధ్యవ కాకపోగా.. టోర్నీ అయినా గెలుపుతో ముగించాలనే లక్ష్యంతో ఛేదనకు దిగిన పాక్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

338 ప‌రుగుల భారీ విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్థాన్ 43.3 ఓవ‌ర్ల‌లో 244 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పాకిస్థాన్ బ్యాట‌ర్ల‌లో ఆగా స‌ల్మాన్ (51) హాఫ్ సెంచ‌రీ చేశాడు. బాబ‌ర్ ఆజామ్ (38), రిజ్వాన్ (36) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో డేవిడ్ విల్లీ, ఆదిల్ ర‌షీద్‌, మొయిన్ అలీ లు చెరో రెండు వికెట్లు తీశారు. గుస్ అట్కిన్సన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 337 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌లో బెన్‌స్టోక్స్ (84), జో రూట్ (60), బెయిర్ స్టో(59) హాఫ్ సెంచ‌రీలు చేశారు. మ‌ల‌న్ (31), హ్యారీ బ్రూక్ (30) లు రాణించారు. పాకిస్థాన్ బౌల‌ర్ల‌లో హరీస్ రవూఫ్ మూడు వికెట్లు తీశాడు. మహ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఇఫ్తికార్ అహ్మద్ ఓ వికెట్ సాధించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement