భారత్‌ను ఏదోవిధంగా దెబ్బ తీయా లన్న లక్ష్యంతో పాకిస్తాన్ పన్నని కుట్ర లేదు. వేయని ఉగ్రపాచిక లేదు. బయట నంగనాచిలా నటిస్తున్న ప్ప టికీ తన ఉగ్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. భారత్‌ను దెబ్బతీసేందుకు ఇప్పుడు బహుముఖ వ్యూ హంతో పాకిస్తాన్ ఉగ్ర పాచికలు వేస్తోంది. తన గడ్డపై ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారత్‌లో జొరబడేందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్న పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్‌లో మైనారిటీలైన హిందువులు, కాశ్మీరీ పండి ట్లను హతమార్చేందుకు ప్రోత్సహిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యో గులపైనా దాడులకు తెగబడుతోంది. గతంతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్‌లో పాక్ పట్టు సడలింది. మళ్లిd పాత కాలంలా పట్టు సాధించేందుకు తెగ తాపత్రయపడు తోంది. అందుకోసం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీనివెనుక పాకిస్తాన్ సైన్యం జోక్యం కూడా ఉంది.మరోవైపు ఆ దేశంలోని మైనారిటీలపై హిందు వులపైనా దాడులు చేస్తోంది. భారత్‌పై పాకిస్తాన్ ఎలా కుట్రలు పన్నుతున్నదీ వివరిస్తూ భారత సైన్యం 33 పేజీల నివేదికలో ఆధారాలతో సహా వివరించింది. పాకిస్తాన్ వికృతరూపాన్ని బహిర్గతం చేసింది. పాకి స్తాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు కొత్తకాదు. కానీ ఈసారి పాకిస్తాన్ సరికొత్త కుట్రలకు ప్రాణం పోసింది. జమ్మూకాశ్మీర్‌లో పనిచేసే పోలీ సులు, టీచర్లు, వలస కార్మికులను హత మార్చే పనిలో ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోంది. వారంతా పాకిస్తాన్‌లో అధికార వర్గా లతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఆధా రాలు సేకరించింది. జమ్మూ కాశ్మీర్‌లో వివిధ రాజకీయ పక్షాలకు చెందిన కార్య కర్తలు, నేతలను హతమార్చా లంటూ యువకులకు నూరిపోస్తోందని నివేదిక పేర్కొంది. ఈ నివేదికలోని తొలి విభాగంలో ఎల్‌ఓసీ వెంబడి పాకిస్తాన్ ఉగ్రవా దుల చొరబాట్లపై వివరాలు వెల్లడించింది. 2020-21లో ఎల్‌ఓసీ వెంబడి 16 సార్లు జొరబాట్లకు పాక్ ఉగ్ర వాదులు ప్రయత్నించి నట్లు పేర్కొంది. అంతర్జాతీయ సరిహద్దు మీదుగా వారు భారీ స్థాయిలో ఆయుధాలతో చొరబడేందుకు ప్రయత్నించడం, పట్టుబడటం జరిగిందని తెలిపింది.
ఈ సందర్భంలో పాక్ ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పో యిన ఉదంతాలను వివరించింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రముఠాల్లోకి కొత్తవారిని చేర్చుకునే ప్రక్రి యను ప్రారంభించిందని ఆ నివేదిక పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువకులను చేరదీసి జిహాద్ పేరు తో వారిలో ఉన్మాదాన్ని నూరిపోస్తోందని, భారత్‌కు వ్యతిరేకంగా వారికి శిక్షణ ఇస్తోందని వివరించింది. ఈ వివరాలు రెండో విభాగంలో పేర్కొన్న భారత సైన్యం నాలుగో విభాగంలో లక్షిత దాడుల గురించి వివరిం చింది. 2019లో కాశ్మీర్‌లో 370వ అధికరణం రద్దు చేసినప్పటినుంచి పాక్ ఆటలు సాగడం లేదు. దాంతో కుతకుతలాడుతున్న దాయాది పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడేలా తన ఉగ్రముఠాలకు శిక్షణ ఇస్తోం దని వివరించింది. సాధారణ పౌరులను హత మార్చడం ద్వారా కాశ్మీర్ లోయలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేదని ప్రచారం చేసే ఉద్దేశంతో ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందని నివేదిక స్పష్టం చేసింది. స్థానిక ఉగ్ర మూకలను ముందుపెట్టి పాకిస్తాన్ ఈ దాడులు చేయి స్తోందని తేల్చింది. ఈ ఏడాది మార్చి తరువాత ఇప్పటి వరకు దాదాపు 12మంది సాధారణ వ్యక్తులను ఉగ్ర వాదులు హతమార్చారని వివరించింది. 370 అధి కరణం రద్దు తరువాత ఇప్పటివరకు 87 మంది పౌరు లను హత్యకు గురైనారని, అంతకుముందు ఐదేళ్లలో 177 మంది మాత్రమే హత్యకు గురైనారని ఆ నివేదిక వివరించింది. చిన్నపిల్లలు, మహిళలన్న తేడా లేకుం డా ఉగ్రవాదులు హత్యాకాండకు పాల్పడ్డారని తెలి పింది. కాశ్మీరేతర వలస కార్మికులు, సాధారణ పౌరుల హత్యలకు సంబంధించిన విషాదకర సన్నివేశాలకు సంబంధించిన ఛాయాచిత్రాలను ఈ నివేదికలో పొందుపర్చారు. స్థానికేతరులు లోయను విడిచిపెట్టి వెళ్లాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని ఉగ్రవాదులు హెచ్చరిస్తూ వేసిన పోస్టర్లను కూడా ఈ నివేదికలో సైన్యం పొందుపరిచింది.
రాజకీయ ప్రక్రియకు ఆటంకాలు
జమ్మూ, కాశ్మీర్‌లో రాజకీయ ప్రక్రియను ఆటం కం కల్పించే లక్ష్యంతోను ప్రభుత్వ పాలనను దెబ్బ తీసేందుకు పాకిస్తాన్ తన ఉగ్రముఠాలను రెచ్చ గొడు తోంది.రాజకీయ నేతలు, ఆయా పార్టీల కార్య కర్తలు, ప్రజా ప్రతినిధులను హత్య చేసేలా ఉగ్ర వాదులను ఉసిగొల్పుతోంది. గడచిన మూడేళ్లలో వివి ధ పార్టీలకు చెందిన 27మందిని ఉగ్రవాదులు హత మార్చినట్లు సైన్యం తన నివేదికలో వివరించింది. ఉగ్ర వాదాన్ని ప్రోత్స హిస్తున్న పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) గ్రే లిస్ట్‌లో చేర్చి నప్పటికీ తన వక్రబుద్ధిని మార్చుకోలేదని, ఉగ్రవా దాన్ని పెంచిపోషిస్తూనే ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఉగ్రకుట్రలను ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లి ఆ దేశం అసలు రూపాన్ని బయటపెట్టే సమయం ఇదేనని ఆ నివేదిక పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.