Friday, October 18, 2024

ENG vs PAK | ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ చిత్తు చిత్తు..

ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో పాక్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్ లో 500కి పైగా పరుగులు చేసిన జట్టు ‘ఇన్నింగ్స్ తేడా’తో ఓడిపోవడం టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే ఇరు జట్లూ తమ తొలి ఇన్నింగ్స్లో 550+ కొట్టిన సందర్భంలో ఫలితం వచ్చిన రెండో మ్యాచ్ ఇదే. ఇంగ్లండ్లోనే 2022లో జరిగిన మ్యాచ్లోనూ పాకిస్థాన్ 74 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ఎక్కువ సేపు నిలవలేదు…

ఓవర్నైట్ 152/6 స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన పాక్ మరో 68 పరుగులు మాత్రమే జోడించింది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు 220కే రెండో ఇన్నింగ్స్లో అలౌటైంది. అఘా సల్మాన్ (63), ఆమీర్ జమాల్ (55*) హాఫ్ సెంచరీలు సాధించినా, తమ జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి మాత్రం గట్టెక్కించలేకపోయారు. చివరి బ్యాటర్ అబ్రార్ అహ్మద్ జ్వరం కారణంగా మైదానంలోకి దిగలేదు. దీంతో పాక్ అలౌటైనట్లు అంపైర్లు ప్రకటించారు.

ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ 4, గస్ అట్కిన్సన్ 2, కార్బె 2, క్రిస్ వోక్స్ ఓ వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ పాక్ 556/10 స్కోరు చేయగా.. ఇంగ్లండ్ 823/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ సెంచరీ సాధించిన హ్యారీ బ్రూక్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.

మరికొన్ని విశేషాలు..

  • స్వదేశంలో పాకిస్తాన్ కు ఇది వరుసగా ఆరో ఓటమి.. గత 3 టెస్టుల్లో ఏడింట్లో పాక్ ఓడిపోయింది. అందులో బంగ్లాదేశ్లో రెండు టెస్టుల సిరీస్ కూడా ఉంది.
  • ముల్తాన్ టెస్టులో మూడు ఇన్నింగ్స్లో కలిసి రన్రేట్ 4.51.
  • పాకిస్థాన్ బౌలర్లు 150 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క మెయిడిన్ మాత్రమే చేయడం గమనార్హం.
  • ఆసియాలో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించడం ఇది రెండోసారి.
  • గతంలో 1976లో భారత్ను ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓడించింది.
Advertisement

తాజా వార్తలు

Advertisement