Wednesday, November 6, 2024

పాకిస్థాన్.. చైనాల‌పై విరుచుకుప‌డిన‌.. భార‌త విదేశాంగ‌మంత్రి

ప్ర‌ధాన అంశాల్లో రాజీప‌డ‌బోమ‌ని..ఉగ్ర‌వాదంతో భార‌త్ ప‌డినంత‌గా ఏ దేశం బాధ‌ప‌డ‌లేద‌ని భార‌త విదేశాంగ‌మంత్రి ఎస్.జైశంక‌ర్ అన్నారు.సైప్రస్ పర్యటనలో ఆయ‌న మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ తీరుపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో చైనాకు కూడా ఘాటైన సందేశాన్ని పంపారు..ఉగ్రవాదాన్ని సాధారణీకరించబోమని, హేతుబద్ధీకరించబోమని చాలా స్పష్టంగా చెప్పామని ఆయన అన్నారు. పాకిస్థాన్ పేరు నేరుగా ప్రస్తావించకుండా విదేశాంగ మంత్రి ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. మేం ఉగ్రవాదాన్ని చర్చల వేదిక వద్దకు తీసుకువచ్చే అవసరం కల్పించడాన్ని ఎప్పటికీ అనుమతించం.

మేం ప్రతి ఒక్కరితో మంచి పొరుగు సంబంధాలను కోరుకుంటున్నాం, కానీ దాని అర్థం ఉగ్రవాదాన్ని క్షమించడమో, పట్టించుకోకపోవడమో, లేదా దాన్ని హేతుబద్ధం చేయడమో కాదని స్పష్టం చేశారు. చైనాతో సరిహద్దు సమస్యలపై కూడా జై శంకర్ స్పందించారు. కోవిడ్ సమయంలో సవాళ్లు తీవ్రమయ్యాయని, చైనాతో సంబంధాలు సాధారణమైనవి కావనీ అన్నారు. ఈ మధ్య అరుణాచల్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా, భారత దళాలు ఘర్షణ పడ్డాయి. కోవిడ్ సమయంలో మా సరిహద్దుల్లో మాకు సవాళ్లు ఉన్నాయి. చైనాతో సంబంధాలు సాధారణమైనవి కావు. ఎందుకంటే ఎల్ ఏసీని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నానికి మేం అంగీకరించం అని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement