వికీపిడియా వెబ్‌సైట్‌ను పాకిస్థాన్ బ్లాక్ చేసింది. అభ్యంతరకరమైన, దైవ దూషణకు చెందిన వ్యాఖ్యలను తొలగించాలని ఆ వెబ్‌సైట్‌కు పాకిస్థాన్ హెచ్చరిక చేసింది. పాకిస్థాన్ టెలికాం అథారిటీ 48 గంటల పాటు వికీపీడియా సర్వీసులను ఆపేసింది. దైవాన్ని దూషిస్తున్నట్లుగా ఉన్న కాంటెంట్‌ను తొలగించకుంటే వికీపీడియాను శాశ్వతంగా బ్లాక్‌లిస్టులో పెడుతామని పాక్ తెలిపింది. వికీపీడియాను బ్లాక్ చేసింది నిజమే అని పాకిస్థాన్ టెలికాం అథారిటీ ప్రతినిధి ఒకరు ద్రువీకరించారు.
వికీపీడియా సైట్‌లో ఉచితంగా ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా అందుబాటులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. వికీమీడియా ఫౌండేషన్ దీన్ని హోస్ట్ చేస్తోంది. దైవదూషణ ఉన్న కాంటెంట్‌ను తొలగించాలని వికీపీడియాకు నోటీసులు ఇచ్చినట్లు పీటీఏ ప్రతినిధి చెప్పారు.