Saturday, November 23, 2024

కరోనా టీకా తయారుచేసిన పాకిస్థాన్.. పేరు ‘పాక్ వ్యాక్’

చిరకాల మిత్ర దేశం చైనా సాయంతో కరోనా కట్టడికి స్వదేశీ టీకాను పాక్ వ్యాక్‌ను (PakVac) అభివృద్ధి చేసినట్లు పాకిస్థాన్​ తెలిపింది. మంగళవారం దీన్ని ఇస్లామాబాద్​లో విడుదల చేసింది. తాము ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లను మిత్ర దేశాల సహకారంతో అధిగమించడమేగాక, వీటిని అవకాశాలుగా మల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పాకిస్థాన్​ ఆరోగ్య శాఖ ప్రత్యేక సహాయాధికారి డా.పైజల్​ సుల్తాన్ తెలిపారు.

పాక్ వ్యాక్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను చైనా సమకూర్చిందని, అయినా దీన్ని అభివృద్ధి చేయడం అంత సలభం కాదని డా.పైజల్ చెప్పారు. చైనా తమకు అత్యంత సన్నిహిత భాగస్వామ్య దేశమని తెలిపారు. త్వరలో ఈ టీకా ఉత్పత్తిని భారీ స్థాయిలో ప్రారంభిస్తామన్నారు.పాకిస్థాన్​లో కరోనా ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. పాజిటివిటీ రేటు 4 శాతం దిగువకు పడిపోయింది. కొత్త కేసుల సంఖ్య (1,771) మూడు నెలల కనిష్ఠానికి తగ్గింది. ఆ దేశంలో ఇప్పటివరకు 9,22,824 మందికి వైరస్ సోకింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొత్తం 73లక్షల టీకా డోసులను పంపిణీ చేశారు. దాదాపు 20 లక్షల మందికి వ్యాక్సినేషన్​ పూర్తయింది

Advertisement

తాజా వార్తలు

Advertisement