Saturday, November 23, 2024

Pakistan – బలూచిస్థాన్ లో నరమేథం … 33 మంది కాల్చివేత

బస్సులు, ట్రక్కులను అడ్డగించిన సాయుధులు
ప్రయాణీకులను కిందకి దించి కాల్చివేత
ఇప్పటికే 33 మంది మృతి
చావు బ‌తుకుల‌లో మ‌రో 21 మంది
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రొవిన్స్ లో ఘ‌ట‌న

ఇస్లామాబాద్ – పాకిస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది. కొందరు సాయుధులు రహదారిని అడ్డగించి, వాహనాల నుంచి ప్రయాణికుల్ని కిందికి దింపేసి కాల్పులు జరిపారు. బలూచిస్థాన్ లోని ముసాఖెల్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటనలో 33 మంది ప్రాణాలు కోల్పోయారని డాన్‌ మీడియా సంస్థ వెల్లడించింది . మ‌రో 21 మందికి బుల్లెట్ ల గాయాలయ్యాయి.

- Advertisement -

ముసాఖెల్ జిల్లాలోని రరాషమ్‌లోని రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు సాయుధులు దారిని అడ్డగించి, అటుగా వస్తోన్న బస్సులు, ట్రక్కుల్లో నుంచి ప్రయాణికుల్ని దింపి, వారి గుర్తింపు తనిఖీ చేశారు. తర్వాత వారిపై కాల్పులు జరపడంతో 23 మంది మృతి చెందారు. అంతేగాకుండా వాహనాలకు నిప్పుపెట్టారు. పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన ప్రయాణికులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు మీడియా పేర్కొంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement