Tuesday, September 17, 2024

PAK vs BAN | పాక్ కు బంగ్లా ధీటైన జవాబు…

పాకిస్థాన్ బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ త‌మ తొలి ఇన్నింగ్స్‌ను 448/6 వ‌ద్ద డిక్లేర్ చేసింది. కాగా, మహమ్మద్ రిజ్వాన్ (171), సౌద్ షకీల్(141) శతకంతో రాణించగా.. సైమ్ ఆయుబ్(56) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 114 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సౌద్ షకీల్, రిజ్వాన్ ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 240 పరుగులు జోడించారు.

కాగా, 449 ప‌రుగుల‌తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మూడో రోజు ముగిసే సమయానికి 92 ఓవర్లలో 5 వికెట్లకు 316 పరుగులు చేసి.. 132 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో ముష్ఫికర్ రహీమ్ (55 బ్యాటింగ్), లిటన్ దాస్ (52 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్ షెడ్‌మన్ ఇస్లామ్ (93), మోమినల్ హక్ (50) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఖుర్రమ్ షెహ్‌జాద్ రెండు వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ అలీ, సయీమ్ ఆయుబ్ ఓ వికెట్ పడగొట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement