Tuesday, November 26, 2024

తుస్సుమన్న పాక్‌ మిస్సైల్​, నవ్వుల పాలైన దాయాది.. పాక్‌లోనే కుప్పకూలిన క్షిపణి

ప్రపంచ దేశాల ముందు మళ్లి పాకిస్తాన్‌ నవ్వులపాలైంది. భారత్‌ క్షిపణి ఒకటి పొరపాటున మిస్‌ ఫైర్‌ అయి పాకిస్తాన్‌లో పడటంతో.. ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నది. తాము ఇలాగే ఓ క్షిపణి ప్రయోగం చేపట్టాలని భావించి.. బొక్కా బోర్ల పడింది. పాక్‌ చేపట్టిన ఈ ప్రయోగం.. ప్రపంచ దేశాలు నవ్వుకునేలా చేసింది. పాక్‌లోని సింధ్‌ రాష్ట్రంలో ఉన్న జంషోర్‌కు సమీపంలోని ఆలియాబాద్‌లో ఓ గుర్తు తెలియని వస్తువు పొగలు చిమ్ముకుంటూ నేలకూలింది. కిందపడిన ఆ వస్తువు క్షిపణి అని తరువాత తేల్చారు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్షిపణి కూలడాన్ని కొందరు వీడియో కూడా తీశారు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్‌ కావాలనే క్షిపణి ప్రయోగం చేసినట్టు తెలుస్తున్నది.

పాక్‌లోని కొన్ని మీడియా సంస్థలు దీన్ని క్షిపణి ప్రయోగంగా ప్రకటించాయి. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సింధ్‌లోని టెస్టు రేంజ్‌ నుంచి పాక్‌ ఓ క్షిపణి ప్రయోగించింది. అయితే ట్రాన్స్‌పోర్టర్‌ ఎరెక్టర్‌ లాంఛర్‌లో సమస్య కారణంగా ఈ ప్రయోగాన్ని గంట పాటు వాయిదా వేశారు. 12 గంటలకు క్షిపణి గాల్లోకి లేచింది. కొద్ది సెకన్లకే మిసైల్‌ గురి తప్పి పాకిస్తాన్‌లోనే కూలిపోయింది. దీనిపై పాక్‌ రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. అది క్షిపణి కాదని.. సాధారణ మోర్టార్‌ ట్రేసర్‌ రౌండ్‌ అని స్థానిక అధికారులు బుకాయిస్తున్నారు. భారత్‌ క్షిపణి ఘటనకు ప్రతీకారంగానే.. పాక్‌ ఈ ప్రయోగం చేసినట్టు ఓ పాక్‌ మీడియా పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement