ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడులు శుక్రవారం రాత్రి జరిగినట్లు నిర్ధారించారు ఆఫ్ఘన్ అధికారులు. పాక్ దాడుల్లో 30 మంది మరణించారని, మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. దాదాపు 26 పాకిస్తానీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఖోస్ట్ ప్రావిన్స్‌లోని మిర్పార్, మందేహ్, షైదీ, కాయి గ్రామాలపై దాడులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.
తాలిబన్ పోలీసు చీఫ్ గేర్బ్‌జ్ ఈ దాడులను ధృవీకరించారు. ఇదిలా ఉండగా గోర్బ్‌జ్ జిల్లాలో శుక్రవారం 9 గంటల సమయంలో పాకిస్తాన్ బలగాలకు, తాలిబన్లకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో ఇద్దరు తాలిబన్ మిలిటెంట్స్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..