గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కేంద్రం పద్మశ్రీ అవార్డ్ ని అందజేసింది. ఈ అవార్డుల రెండో విడత ప్రధానోత్సవం బుధవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను అందజేశారు. కీరవాణితో పాటుగా తెలుగు రాష్ట్రాల నుంచి అవార్డ్ అందుకున్నవారిలో త్రియండి చినజీయర్ స్వామి కూడా ఉన్నారు. ఈయన పద్మభూషణ్ అందుకున్నారు. కీరవాణి పద్మశ్రీ అందుకోవడంతో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పెద్దన్నను చూస్తుంటే గర్వంగా ఉందంటూ కీరవాణితో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు జక్కన్న. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళి ట్వీట్ కు నెటిజన్లు వరుసగాస్పందిస్తున్నారు. ఇద్దరు పద్మాఅవార్డ్ గ్రహీతలు ఒక ఫ్రేమ్ లో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాటు నాటు పాటతో కీరవాణి టాలీవుడ్ సినిమాను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లారు. తన పాటతో విదేశీయులతో స్టెప్పులు వేయించాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement