Saturday, November 23, 2024

పద్మ అవార్డుల పోర్టల్‌ ప్రారంభం.. సెప్టెంబర్‌ 15 వరకు నామినేషన్ల స్వీకరణ

పద్మ అవార్డుల నామినేషన్ల స్వీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం పోర్టల్‌ ప్రారంభించింది. ఈ పోర్టల్‌ ద్వారా పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌, పద్మశ్రీ – 2023 అవార్డుల కోసం నామినేషన్లు, రికమండేషన్లను స్వీకరించనుంది. నామినేషన్లకు ఆఖరి గడువు సెప్టెంబర్‌ 15. కామన్‌ పోర్టల్‌ ద్వారా ప్రభుత్వం లోని పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఏజెన్సీలను ఒకే ప్లాట్‌ఫామ్‌ పైకి చేర్చడం జరిగింది. డిజిటల్‌ ఇండియా అవార్డులు, జీవన్‌ రక్ష పదక్‌ సిరీస్‌ అవార్డులు, నారీశక్తి పురస్కార్‌, పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ టెలికాం స్కిల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు, సర్దార్‌ పటేల్‌ జాతీయ సమగ్రత అవార్డు, సుభాష్‌ చంద్రబోస్‌ ఆపద ప్రభానందన్‌ పురస్కార్‌లతో పాటు ప్రత్యేక వ్యక్తులకు ఇచ్చే నేషనల్‌ అవార్డులకు సైతం నామినేషన్లను స్వీకరించనుంది. పద్మ అవార్డులతో పాటు మరో 14 ఇతర కేటగిరీలకు సైతం నామినేషన్లను స్వీకరించనుంది. ఆశావహుశలు సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement