వేసవి సెలవులు కావడంతో పిల్లలు పుస్తకాలను పక్కనపెట్టి ఫోన్లలో కాలక్షేపం చేస్తుంటారు. ఆన్ లైన్ ఏదో ఒక గేమ్ డౌన్ లోడ్ చేసుకుని ఆడుతుంటారు.. ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పబ్జీ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గేమ్ ఆడేందుకు ఎంతలా అంటే వీటి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ గేమ్ వలన పిల్లలు తల్లిదండ్రుల మాటను సైతం లెక్క చేయడం లేదు. తాజాగా ఆన్‌లైన్ గేమ్ పబ్జీ ఆడకుండా అడ్డుకున్నందుకు ఏకంగా తన తల్లినే కాల్చి చంపాడు ఓ మైనర్ బాలుడు. తల్లి మృతదేహంతో రెండు రోజులపాటు ఇంట్లోనే ఉన్నాడు. హత్యను కప్పిపుచ్చేందుకు పోలీసులకు కట్టుకథలు చెప్పాడు. అయితే పోలీసులు తమదైన స్టైలులో ప్రశ్నించేసరికి అసలు విషయం ఒప్పుకున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకుంది. ఓ బాలుడు ఇటీవల పబ్జీ గేమ్ ఆడటం ప్రారంభించారు. దీనికి ఎంతలా బానిసైయ్యాడంటే ఇంట్లో వారిని, చదువును అన్ని పక్కన పెట్టి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పబ్జీ ఆడుతునే ఉన్నాడు. ఇది గమనించిన తల్లి చదువుకోమని, ఎప్పుడు ఫోన్ లో గేమ్ ఆడుతూనే ఉంటావా అని మందిలించింది. దీంతో బాలుడు క్షణికావేశంలో తన తండ్రి పిస్టోల్ తీసుకుని తల్లిని కాల్చి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement