Tuesday, November 12, 2024

ఓయో ఐపీఓ పత్రాలు వెనక్కి.. సరి చేసిన అప్లయ్‌ చేయాలన్న సెబీ

ఓయో పేరిట ఆతిథ్య సేవలు అందిస్తున్న ఒరావెల్‌ స్టేట్‌ లిమిటెడ్‌ మార్కెట్‌ నియంత్రా సంస్థ సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రాలను తిప్పి పంపించింది. తగిన మార్పులు చేసి తిరిగి పంపించాలని ఆదేశించింది. దీని వల్ల ఓయో పబ్లిక్‌ ఆఫర్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గురుగ్రామ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ యూనికార్న్‌ కంపెనీ తొలిసారిగా సెప్టెంబర్‌ 2021లో ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది. 8,430 కోట్లు ఐపీఓ ద్వారా సమీకరించాలని యోచిస్తున్నట్లు అప్పటి ముసాయిదా పత్రాల్లో పేర్కొంది. 7 వేల కోట్ల విలువ చేసే తాజా షేర్లతో పాటు, 1430 కోట్ల విలువైన ఆఫర్‌ ఫర్‌ సేల్‌ షేర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ముసాయిదాను సెబీ డిసెంబర్‌ 30న తిప్పి పంపించింది. చేయాల్సిన మార్పులు ఏంటన్న విషయాన్ని మాత్రం సెబీ తన వెబ్‌సైట్‌లో పేర్కొనలేదు.

- Advertisement -

ఈ ఆర్ధిక సంవత్సరం ప్రథమార్ధానికి సంబంధించి ఆర్ధిక ఫలితాలతో కూడిన పత్రాలను సెబీకి ఓయో సమర్పించింది. తొలి అర్ధ భాగంలో 63 కోట్ల లాభం వచ్చినట్లు ఓయో తెలిపింది. సంవత్సరం క్రితం ఇదే సమయంలో 280 కోట్ల నష్టాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య ఆదాయం 24 శాతం పెరిగి 2,905 కోట్లుగా నమోదైందని తెలిపింది. ఓపీఓ దరఖాస్తును సమీక్షించే నాటికి తాజా పత్రాలు సమర్పించాలని ఓయోకు సెబీ గడువు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement